జూలై 10న రాష్ట్రవ్యాప్తంగా విద్యాసంస్థల బంద్కు వామపక్ష విద్యార్థి సంఘాల పిలుపు
ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి ఖమ్మంపాటి శంకర్, AISBజిల్లా కార్యదర్శి పరంగి రాము,AIFDS కాశి మాట్లాడుతూ ఈనెల 10వ తేదీన విద్యా రంగ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా విద్యాసంస్థల బంద్ నిర్వహిస్తున్నామని అన్ని రంగాల విద్యాసంస్థలు సహకరించాలని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం మూడు సంవత్సరాలు నుండి విద్యాశాఖకు మంత్రి పదవి కేటాయించకుండా ముఖ్యమంత్రి దగ్గర ఉంచుకోవడం దుర్మార్గమని అన్నారు. 27 వేల ప్రభుత్వ పాఠశాలలను , నాలుగు వేల పాఠశాలలకు తగ్గిస్తామని చెప్పడం పేద విద్యార్థులకు అన్యాయం చేయడం అని అన్నారు. విద్యా శాఖలో ఖాళీగా ఉన్న, డీఈవో, ఎం ఈ ఓ, ఇతర పోస్టులను వెంటనే భర్తీ చేయాలని, ప్రభుత్వ పాఠశాలలో మౌలిక సదుపాయాలు కల్పించాలని, గురుకుల పాఠశాలలకు సొంత భవనాలు నిర్మించాలని డిమాండ్ చేశారు.
ప్రైవేటు పాఠశాలలో, జూనియర్ కళాశాలలో విచ్చలవిడిగా ఫీజులు పెంచారని, ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తుందని, పెంచిన ఫీజులను వెంటనే తగ్గించాలని, ఫీజుల నియంత్రణ చట్టం అమలు చేయాలని, ప్రైవేటు పాఠశాలలో ఇస్తాను రాజ్యాంగ పుస్తకాలు, యూనిఫామ్, డైరీలు అమ్ముతున్నారని, విద్యార్థుల సొమ్ము దోచుకు తింటున్నారని విమర్శించారు. ప్రైవేట్ విద్యాసంస్థలలో ఫీజులు నియంత్రించకపోతే, దాడులు చేస్తామని హెచ్చరించారు.ఈ సమావేశం లో SFI జిల్లా అధ్యక్షుడు ఆకారపు నరేష్, SFI మిర్యాలగూడ డివిజన్ అధ్యక్షా, కార్యదర్శూలు మూడవత్ జగన్ నాయక్ ,కుర్ర సైదా నాయక్,లోహి, ఝాన్సీ,వీరన్న సుభాని ,బన్ని,AISFనాయకులు యశ్వంత్, అబ్దుల్, ప్రశాంత్, తదితరులు పాల్గొన్నారు
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Wow
0
Sad
0
Angry
0
Comments (0)