చీమకుర్తిలో ది గుంటూరు కోపరేటివ్ అర్బన్ బ్యాంక్ 23వ శాఖ ఘన ప్రారంభం
నేటి ఇజం :" ది గుంటూరు కోపరేటివ్ అర్బన్ బ్యాంక్ " 23వ బ్రాంచ్ శుక్రవారం ప్రకాశం జిల్లా చీమకుర్తిలో ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బ్యాంక్ చైర్మన్ బోనబోయిన శ్రీనివాస్ యాదవ్ ,స్థానిక శాసనసభ్యులు బి.ఎన్ విజయ్ కుమార్, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి కుమారుడు బాలినేని ప్రణీత్ రెడ్డి,ఊడ చైర్మన్ షేక్ రియాజ్, జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ,కనిగిరి శాసనసభ్యులు ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి, స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.



ఈ సందర్భంగా బ్యాంకు చైర్మన్ బోనబోయిన శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ"సుమారు 1200 కోట్ల రూపాయల టర్నోవర్తో, రిజర్వ్ బ్యాంకు నిబంధనలకు అనుగుణంగా నడుస్తున్న ఈ బ్యాంకు గృహ నిర్మాణాలకు, వ్యాపారాలకు ప్రధానంగా రుణాలు ఇచ్చేందుకు సిద్ధంగా ఉందని , కోపరేటివ్ బ్యాంక్ అనగానే ఇది వ్యవసాయానికి రైతులకు ఉపయోగపడుతుందనీ.. అనుకుంటారు, కానీ ఇది పూర్తిగా వాణిజ్యపరమైన అవసరాలకు రుణ అవకాశాలు కనిపిస్తుంది అని చీమకుర్తి పుర,పరిసర ప్రాంత ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలియజేశారు.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Wow
0
Sad
0
Angry
0
Comments (0)