సినార్డ్–టీబీ అలర్ట్ ఇండియా ఆధ్వర్యంలో మెగా హెల్త్ క్యాంపు, 180 మంది వలస కార్మికులకు వైద్య పరీక్షలు
చీమకుర్తి వలస కార్మికుల ఆరోగ్య పరిరక్షణే లక్ష్యంగా సినార్డ్ సంస్థ, టీబీ అలర్ట్ ఇండియా ఆధ్వర్యంలో కిమ్స్ హాస్పిటల్ సహకారంతో శుక్రవారం ఆపిల్ క్వారీలో మెగా హెల్త్ క్యాంపు నిర్వహించారు. క్వారీలో పనిచేస్తున్న వలస కార్మికులు, సిబ్బందికి వైద్య పరీక్షలు నిర్వహించడంతో పాటు హెచ్ఐవి, టీబీపై అవగాహన కల్పించారు.

ఈ సందర్భంగా సుమారు 180 మంది కార్మికులు, సిబ్బందికి వివిధ రకాల వైద్య పరీక్షలు నిర్వహించారు. హెచ్ఐవి పరీక్షలు, టీబీ స్క్రీనింగ్, ఈసీజీ, బీపీ, షుగర్ పరీక్షలతో పాటు కంటి సంబంధిత వైద్య పరీక్షలు నిర్వహించారు. వైద్యులు ప్రతి ఒక్కరినీ పరీక్షించి, వారి ఆరోగ్య పరిస్థితిపై తగిన సూచనలు చేశారు. అవసరమైన వారికి ఉచితంగా మందులను పంపిణీ చేశారు.
టీబీ, హెచ్ఐవి వ్యాధుల పట్ల అపోహలు వీడి, వ్యాధి లక్షణాలు కనిపించిన వెంటనే వైద్యులను సంప్రదించాలని వైద్య సిబ్బంది సూచించారు. ముఖ్యంగా వలస కార్మికులు తమ ఆరోగ్యంపై నిర్లక్ష్యం చేయకుండా క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు చేయించుకోవాలని అవగాహన కల్పించారు. ఆరోగ్య సమస్యలను ప్రారంభ దశలోనే గుర్తిస్తే సకాలంలో చికిత్స అందించి వ్యాధులను నియంత్రించవచ్చని తెలిపారు.

ఈ మెగా హెల్త్ క్యాంపులో ఆపిల్ క్వారీ జనరల్ మేనేజర్ శిద్ధా పవన్, మైన్స్ మేనేజర్ లోకేష్, సినార్డ్ సంస్థ ప్రాజెక్ట్ మేనేజర్ వెంకటేశ్వర్లు, టీబీ అలర్ట్ ఇండియా ప్రాజెక్ట్ మేనేజర్ ప్రదీప్, కిమ్స్ హాస్పిటల్ వైద్యులు, సినార్డ్ సంస్థకు చెందిన వైద్యులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

వలస కార్మికులకు వైద్య సేవలను అందించేందుకు ముందుకు వచ్చిన సినార్డ్ సంస్థ, టీబీ అలర్ట్ ఇండియా, కిమ్స్ హాస్పిటల్ ప్రతినిధులను క్వారీ యాజమాన్యం అభినందించింది. భవిష్యత్తులోనూ కార్మికుల ఆరోగ్య పరిరక్షణకు ఇటువంటి వైద్య శిబిరాలను నిర్వహించేందుకు కృషి చేస్తామని నిర్వాహకులు తెలిపారు.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Wow
0
Sad
0
Angry
0
Comments (0)