చిరంజీవి అభిమాని కుటుంబానికి ఆర్థిక సాయం
ఇల్లంతకుంట మండలం రామోజీపేటలో శనివారం హృదయాన్ని కదిలించే సేవా కార్యక్రమం నిర్వహించారు. కమలాపూర్ మండలానికి చెందిన దివంగత చిరంజీవి అభిమాని కిరణ్ కుమార్ కుటుంబానికి తెలంగాణ రాష్ట్ర బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ బసవరాజు శ్రీనివాస్ ప్రతి సంవత్సరం అందిస్తున్న రూ.20 వేల విద్యా సహాయాన్ని ఈ ఏడాది కూడా ఆయన భార్య స్వప్నకు కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, మాజీ రాజ్యసభ సభ్యుడు ప్రభుత్వ సలహాదారులు వి. హనుమంతరావు చేతుల మీదుగా అందజేశారు.
దివంగత కిరణ్ కుమార్‌కు ఇద్దరు కుమార్తెలు ఉండగా, వారి విద్యాభ్యాసానికి చేయూతగా ప్రతి ఏడాది ఈ ఆర్థిక సహాయాన్ని అందిస్తున్నట్లు బసవరాజ్ శ్రీనివాస్ తెలిపారు. బాధిత కుటుంబానికి అండగా నిలవడం సమాజం బాధ్యత అని ఈ సందర్భంగా వి. హనుమంతరావు పేర్కొన్నారు. బసవరాజు శ్రీనివాస్ చేపడుతున్న ఈ సేవా కార్యక్రమం అభినందనీయమని కొనియాడారు.
ఈ కార్యక్రమంలో మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ, చిరంజీవి యువత రాష్ట్ర అధ్యక్షుడు వేల్పుల వెంకటేష్, నాయకులు జనగామ నాగరాజు, అరుణ్ తేజ చారి, మిడిదొడ్డి కపిల్ మాధవ్, గాలిపెల్లి కుమార్, దిలీప్ తదితరులు పాల్గొన్నారు.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Wow
0
Sad
0
Angry
0
Comments (0)