"నాపై చెప్పులతో ఆలయంలోకి వెళ్లిన ఆరోపణలు అసత్యం" – దేవస్థానం చైర్మన్ డా. కందుల నాగరాజు

Saturday, June 6, 2026 - 19:04
0
"నాపై చెప్పులతో ఆలయంలోకి వెళ్లిన ఆరోపణలు అసత్యం" – దేవస్థానం చైర్మన్ డా. కందుల నాగరాజు

తనపై జరుగుతున్న ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదని శ్రీశ్రీశ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారి దేవస్థానం చైర్మన్ డాక్టర్ కందుల నాగరాజు స్పష్టం చేశారు.

 

తన కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన, ఈ నెల 1వ తేదీన తాను ఆలయంలో చెప్పులు ధరించి ప్రవేశించినట్లు ఒక ఫోటోను సోషల్ మీడియా వేదికల్లో వైరల్ చేస్తూ కొందరు కావాలనే అసత్య ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

 

వాస్తవానికి ఆ ఫోటో ప్రధాన ఆలయంలో తీసింది కాదని, ఆలయం వెలుపల పీఆర్ఓ కార్యాలయం వెనుక భాగంలో భక్తుల సౌకర్యార్థం ఏర్పాటు చేసిన ప్రత్యేక గది వద్ద తీసినదని తెలిపారు. భక్తులకు, ముఖ్యంగా మహిళలకు అవసరమైన సమయంలో ఉపయోగపడేలా అక్కడ ప్రత్యేక సౌకర్యాలు కల్పించామని చెప్పారు.

 

ఆ రోజు అమ్మవారి దర్శనానికి వచ్చిన ఓ మహిళా భక్తురాలికి ఇబ్బంది కలగడంతో, ఆమెను మదర్ ఫీడింగ్ గదికి పంపించే సమయంలో అక్కడ ఉన్న భక్తులతో మాట్లాడుతుండగా ఆ ఫోటో తీసినట్లు వివరించారు. అయితే ఆ ఫోటోను కావాలనే వక్రీకరించి, తాను ఆలయంలో చెప్పులతో ఉన్నట్లు తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.

 

ప్రధాన ఆలయానికి, ఆ ప్రత్యేక గదికి మధ్య స్పష్టమైన విభజన ఉందని, తాను ఎప్పుడూ ప్రధాన ఆలయంలోకి చెప్పులు ధరించి ప్రవేశించలేదని స్పష్టం చేశారు. నిజాలు తెలుసుకోకుండా సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలు చేయడం బాధ్యతారాహిత్యమని పేర్కొన్నారు.

 

తాను నిత్యం శివపార్వతుల ఆరాధన చేస్తానని, శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారు తమ ఇంటి వేల్పు అని తెలిపారు. సనాతన ధర్మాన్ని విశ్వసిస్తూ, నియమ నిష్ఠలతో జీవించే వ్యక్తిగా తాను ఆలయ సంప్రదాయాలను ఉల్లంఘించే ప్రశ్నే లేదన్నారు.

 

దేవస్థానం చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి రోజుకు రెండు పూటలా ఆలయాన్ని సందర్శిస్తూ, భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు మరియు దేవస్థానం అభివృద్ధికి కృషి చేస్తున్నట్లు చెప్పారు. భక్తులు ఎటువంటి ఇబ్బందులు లేకుండా అమ్మవారి దర్శనం చేసుకుని సంతోషంగా వెళ్లాలన్నదే తన లక్ష్యమని పేర్కొన్నారు.

 

మీడియా ప్రతినిధులు, భక్తులు, శ్రేయోభిలాషులు సైతం తనకు మద్దతుగా నిలుస్తూ, భక్తి భావంతో ఉండే తాను ఇలాంటి పొరపాటు చేయరని చెబుతున్నారని తెలిపారు.

 

కొందరు వ్యక్తులు కావాలనే దుష్ప్రచారం చేస్తూ దేవస్థానం ప్రతిష్ఠను దెబ్బతీయాలని ప్రయత్నించడం విచారకరమని, ప్రజలు వాస్తవాలను గుర్తించి అసత్య ప్రచారాలను నమ్మవద్దని డాక్టర్ కందుల నాగరాజు విజ్ఞప్తి చేశారు.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Wow Wow 0
Sad Sad 0
Angry Angry 0
RNI News

Reportage News International (RNI) is India's growing news website which is an digital platform to news, ideas and content based article. Destination where you can catch latest happenings from all over the globe Enhancing the strength of journalism independent and unbiased.

Comments (0)

User