సిర్పూర్ యూ మండలంలో నకిలీ పత్తి విత్తనాల ముఠా బట్టబయలు
కుమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా మే 22 (RNI) జిల్లాలో నకిలీ పత్తి విత్తనాల అక్రమ రవాణా, విక్రయాలపై ప్రత్యేక నిఘా కొనసాగుతున్న నేపథ్యంలో సిర్పూర్ (యు) పోలీస్ స్టేషన్ సమీపంలో నిర్వహించిన వాహన తనిఖీల్లో 5.45 క్వింటాళ్ల నకిలీ పత్తి విత్తనాలను స్వాధీనం చేసుకున్నట్లు జిల్లా ఎస్పీ నితిక పంత్ తెలిపారు.
శుక్రవారం సిర్పూర్ (యు) పోలీస్ స్టేషన్ సమీపంలో ఎస్ఐ విక్రమ్ తన సిబ్బందితో కలిసి వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా అనుమానాస్పదంగా సంచరిస్తున్న ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకుని విచారించారు. వారి వద్ద నుంచి మొత్తం 68 కిలోల (152 ప్యాకెట్ల) పత్తి విత్తనాలు లభించాయి. ఒక్కో ప్యాకెట్‌లో సుమారు 450 గ్రాముల చొప్పున విత్తనాలు ఉండగా, వాటిపై ప్రభుత్వ ఆమోదిత వివరాలు, క్యూ ఆర్ కోడ్, హలోగ్రామ్, లాట్ నెంబర్ వంటి గుర్తింపులు లేకపోవడం గమనించారు.
దీంతో వెంటనే వ్యవసాయ శాఖ అధికారి ఆనందరావుకు సమాచారం అందించగా, ఆయన పరిశీలించి వాటిని నకిలీ పత్తి విత్తనాలుగా నిర్ధారించారు. అనంతరం పంచనామా నిర్వహించి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
ఈ కేసుపై ఆసిఫాబాద్ సబ్ డివిజన్ డిఎస్పి అశోక్ ఆధ్వర్యంలో దర్యాప్తు చేపట్టగా, గత రెండు నెలలుగా సిర్పూర్ మండల పరిధిలో సుమారు 6.75 క్వింటాళ్ల నకిలీ పత్తి విత్తనాలను లాభాపేక్షణతో రైతులకు సరఫరా చేయాలనీ తీసుకరాగా, నిందితుడు A2 నైతం జంగు ఇంటి వద్ద మరో (1100 ప్యాకెట్స్) 4.90 క్వింటాళ్ల నకిలీ పత్తి విత్తనాలను స్వాధీనం చేసుకోగా, మొత్తం 5.45 క్వింటాళ్ళ నకిలీ పత్తి విత్తనాలు స్వాధీనం పరుచుకొని దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు పేర్కొన్నారు.
కేసులో నిందితుల వివరాలు:
A1) మంగునాథ్ S/o సమందరనాథ్, వయస్సు: 64 సంవత్సరాలు, వృత్తి: వ్యాపారం, నివాసం: జూనపాని, మధ్యప్రదేశ్. ప్రస్తుతం: ఇంద్రవెల్లి, ఆదిలాబాద్ జిల్లా.
A2) నైతం జంగు S/o నానాజీ, వయస్సు: 40 సంవత్సరాలు, వృత్తి: మేస్త్రి, నివాసం: సిర్పూర్ (యు), కుమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా.
A1, A2 లను అరెస్ట్ చేసి, రిమాండ్ పంపిస్తున్నట్లు తెలిపారు. ఈ నకిలీ విత్తనాలు పట్టుకోవడంలో కృషి చేసిన డీఎస్పీ అశోక్ , ఎస్సై విక్రమ్ , కానిస్టేబుల్స్ నాగేంద్రబాబు, నాగేంద్ర లను ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు.
రైతులు నకిలీ విత్తనాల పట్ల అప్రమత్తంగా ఉండాలని, ప్రభుత్వ అనుమతులు ఉన్న విక్రయ కేంద్రాల నుంచే విత్తనాలు కొనుగోలు చేయాలని జిల్లా ఎస్పీ సూచించారు. నకిలీ విత్తనాల సమాచారం ఉంటే వెంటనే సమీప పోలీస్ స్టేషన్ లో గాని, డయల్ 100 ద్వారా గాని తెలియజేయాలని కోరారు.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0



