తెలంగాణలో కేబుల్ జర్నలిస్టులకు గుడ్ న్యూస్ – అక్రిడిటేషన్ దరఖాస్తులకు గడువు ప్రకటింపు

Saturday, April 11, 2026 - 13:25
0
తెలంగాణలో కేబుల్ జర్నలిస్టులకు గుడ్ న్యూస్ – అక్రిడిటేషన్ దరఖాస్తులకు గడువు ప్రకటింపు

తెలంగాణలో కేబుల్ జర్నలిస్టులకు శుభవార్త అందింది. రాష్ట్ర మరియు జిల్లా స్థాయి అక్రిడిటేషన్ కార్డుల కోసం ఈ నెల 17వ తేదీ లోపు దరఖాస్తులు సమర్పించాలని సీహెచ్ ప్రియాంక సూచించారు. హైదరాబాద్ కేంద్రంగా ప్రసారమయ్యే ఛానళ్లు రాష్ట్ర లేదా జిల్లా స్థాయిలో దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించగా, జిల్లాల్లో స్టూడియోలు నిర్వహిస్తున్న ఛానళ్లు తమ తమ జిల్లాల్లోనే అప్లై చేయాల్సి ఉంటుంది.

దరఖాస్తు ప్రక్రియలో భాగంగా ఛానల్ పేరు, స్టూడియో అడ్రస్, MIB సర్టిఫికెట్, లేబర్ లైసెన్స్ మరియు MSO అగ్రిమెంట్లను జత చేయాలని స్పష్టం చేశారు. అర్హత ప్రమాణాలు పూర్తి చేసిన ఛానళ్లకు అక్రిడిటేషన్ కార్డులు జారీ చేయనున్నట్లు తెలిపారు.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Wow Wow 0
Sad Sad 0
Angry Angry 0
RNI News

Reportage News International (RNI) is India's growing news website which is an digital platform to news, ideas and content based article. Destination where you can catch latest happenings from all over the globe Enhancing the strength of journalism independent and unbiased.

Comments (0)

User