కుర్ర రంగ నాయక్ నాని ఇన్‌స్టాగ్రామ్ ఖాతా హ్యాక్.. ప్రజలకు అప్రమత్తంగా ఉండాలని విజ్ఞప్తి

May 28, 2026 - 15:07
 0  270
కుర్ర రంగ నాయక్ నాని ఇన్‌స్టాగ్రామ్ ఖాతా హ్యాక్.. ప్రజలకు అప్రమత్తంగా ఉండాలని విజ్ఞప్తి

సోషల్ మీడియా వినియోగదారుల్లో ఆందోళన కలిగించే ఘటన వెలుగులోకి వచ్చింది. కుర్ర రంగ నాయక్ నాని పేరుతో ఉన్న ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ హ్యాక్ అయినట్లు సమాచారం. అలాగే వాట్సాప్ ఖాతా కూడా హ్యాకర్ల నియంత్రణలోకి వెళ్లినట్లు బాధితుడు తెలిపాడు.

ఈ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయన విజ్ఞప్తి చేశారు. తన పేరుతో ఎవరైనా ఇన్‌స్టాగ్రామ్ లేదా వాట్సాప్ ద్వారా డబ్బులు అడిగినా నమ్మవద్దని, ఎట్టి పరిస్థితుల్లోనూ డబ్బులు పంపవద్దని కోరారు. ప్రస్తుతం తన వాట్సాప్ పూర్తిగా తన కంట్రోల్‌లోకి తిరిగి రాలేదని, సాంకేతిక సమస్యలు ఇంకా కొనసాగుతున్నాయని వెల్లడించారు.

హ్యాక్ అయిన ఇన్‌స్టాగ్రామ్ ఐడి పేరు “నానిఅమ్ములు_39787”గా గుర్తించారు. ఈ ఖాతా ద్వారా ఎలాంటి అనుమానాస్పద మెసేజ్‌లు వచ్చినా వెంటనే జాగ్రత్తగా ఉండాలని ప్రజలకు సూచించారు.

సైబర్ మోసాలు పెరుగుతున్న నేపథ్యంలో సోషల్ మీడియా వినియోగదారులు తమ ఖాతాల భద్రతపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని నిపుణులు సూచిస్తున్నారు.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0
RNI News Reportage News International (RNI) is India's growing news website which is an digital platform to news, ideas and content based article. Destination where you can catch latest happenings from all over the globe Enhancing the strength of journalism independent and unbiased.