IBPSలో 11,403 క్లర్క్ పోస్టుల భర్తీకి భారీ నోటిఫికేషన్ విడుదల
న్యూఢిల్లీ: బ్యాంకు ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనెల్ సెలెక్షన్ (IBPS) శుభవార్త తెలిపింది. దేశవ్యాప్తంగా 11 ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో కస్టమర్ సర్వీస్ అసోసియేట్ (CSA/క్లర్క్) పోస్టుల భర్తీ కోసం CRP CSA-XVI నోటిఫికేషన్ను విడుదల చేసింది. ఈ నియామక ప్రక్రియ ద్వారా మొత్తం 11,403 ఖాళీలను భర్తీ చేయనుంది. వీటిలో తెలంగాణలో 191, ఆంధ్రప్రదేశ్లో 186 పోస్టులు ఉన్నాయి.
అభ్యర్థులు 2026 ఆగస్టు 1 నుంచి ఆగస్టు 21 వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి ఏదైనా డిగ్రీ పూర్తి చేసి, 20 నుంచి 28 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న అభ్యర్థులు దరఖాస్తుకు అర్హులు. రిజర్వేషన్ వర్గాలకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
ఎంపిక ప్రక్రియలో ప్రిలిమినరీ ఆన్లైన్ పరీక్ష, మెయిన్స్ ఆన్లైన్ పరీక్ష మరియు స్థానిక భాష ప్రావీణ్య పరీక్ష (LLPT) ఉంటాయి. ఈ నియామక ప్రక్రియలో ఇంటర్వ్యూ ఉండదు.
ప్రిలిమినరీ పరీక్ష అక్టోబర్ 2026లో, మెయిన్స్ పరీక్ష డిసెంబర్ 2026లో నిర్వహించనున్నారు. ఆసక్తి గల అభ్యర్థులు పూర్తి వివరాలు, అర్హతలు మరియు దరఖాస్తు ప్రక్రియ కోసం అధికారిక వెబ్సైట్ **[www.ibps.in**ను](http://www.ibps.in**ను) సందర్శించవచ్చు.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Wow
0
Sad
0
Angry
0
Comments (0)